కాంగ్రెస్​ అధికార ప్రతినిధిగా చెల్లిమల్ల లక్ష్మీకాంతం

కాంగ్రెస్​ అధికార ప్రతినిధిగా చెల్లిమల్ల లక్ష్మీకాంతం

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ డీసీసీ అధికార ప్రతినిధిగా చెల్లిమల లక్ష్మీకాంతం నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం తన ఆఫీసులో లక్ష్మీకాంతంకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ.. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు, స్థానం ఉందన్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. 

బూత్​స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అండగా నిలవాలని కోరారు. తన నియామకానికి కృషి చేసిన అంజన్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.