డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా... సీఎం చంద్రబాబును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వేణుగోపాల్. పవన్ కళ్యాణ్ చాలా మందిని స్ఫూర్తిగా తీసుకున్నారని.. గతంలో చెగువేరా.. నిన్న సనాతన ధర్మం.. నేడు చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకున్నానని అంటున్నారని అన్నారు.
చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుంటే ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.తిరుమల లడ్డూ విషయంలో పవన్ ఆడిన డ్రామా వర్కౌట్ అవ్వలేదని.. ప్రజలకు నిజం తెలిసిపోయిందని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు వేణుగోపాల్.
తమవారికి సంపద సృష్టించేందుకే చంద్రబాబు కొత్త మద్యం పాలసీ తెచ్చారని అన్నారు.మద్యం టెండర్లకు రెండు రోజులు గడువు ఎందుకు పెంచారని... మద్యం పాలసీతో ప్రజలను తాగుబోతులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ సిండికెట్లకే టెండర్లు కేటాయిస్తున్నారని అన్నారు వేణుగోపాల్.