హైదరాబాద్‌లోని రాంనగర్‌లో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. ముషీరాబాద్ సమీపంలోని రాంనగర్‌లో చెత్తకుప్పలో ఉన్న కెమికల్ డబ్బా అకస్మాత్తుగా పేలింది. డబ్బా పేలుడుకు మంటలు చెలరేగి మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నాగయ్య కుడిచేతి బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం నాగయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాగయ్య చెత్త కుప్పలో చెత్తను ఏరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ కార్డన్ సెర్చ్‌కు భయపడే ఏవరో ఈ డబ్బాను ఇక్కడ వేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన క్లూస్ టీం.. పేలుడుకు కారణమైన ఆ డబ్బాను ల్యాబ్‌కు పంపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..