మంచిర్యాలలో చెన్నై-జోధ్​పూర్ ఎక్స్​ప్రెస్ హాల్టింగ్ : ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాలలో చెన్నై-జోధ్​పూర్ ఎక్స్​ప్రెస్ హాల్టింగ్ : ఎంపీ వంశీకృష్ణ
  • మరో వీక్లీ రైలు హాల్టింగ్​కు కూడా నిర్ణయం
  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అభ్యర్థనకు స్పందించిన రైల్వే బోర్డు

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో మంచిర్యాల రైల్వే స్టేషన్​లో చెన్నై–జోధ్​పూర్​ఎక్స్​ప్రెస్(06157/06158), ఎంఎస్​-బీజీకేటీ వీక్లీ ఎక్స్​ప్రెస్ (20625/20626) ప్రయోగాత్మక హాల్టింగ్ మంజూరుకు రైల్వే బోర్డు అంగీకరించింది. ఈ రెండు ఎక్స్​ప్రెస్​రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఈ నెల 10న వంశీకృష్ణ సికింద్రాబాద్​ డివిజనల్​రైల్వే మేనేజర్ ​భారతేశ్ కుమార్​జైన్​కు వినతిప్రతం సమర్పించారు. రైల్వే నిబంధన ప్రకారం స్టాఫేజ్​మంజూరుకు అవసరమైన ఆదాయ ప్రమాణాలు సాధించకపోయినప్పటికీ ఎంపీ అభ్యర్థన మేరకు రెండు రైళ్లకు ప్రయోగాత్మక స్టాఫేజ్ మంజూరు విషయాన్ని బోర్డు పరిగణలోకి తీసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటనలో పేర్కొంది.

 ఈ రెండు ఎక్స్​ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించడం ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు ట్రాన్స్​పోర్ట్ మరింత మెరుగవుతుందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యమని, మంచిర్యాల ప్రజలకు అవసరమైన రైల్వే సదుపాయాలను తీసుకురావడం గర్వకారణంగా ఉందన్నారు. ఇది స్థానిక ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చడంలో చాలా ఉపయోగపడుతుందని, ఈ సందర్భంగా రైల్వే బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.