మంకీపాక్స్ టెస్టుకు RT-PCR కిట్

మంకీపాక్స్ అందరినీ కలవర పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఇన్ఫెక్షన్ ను గుర్తించేందుకు ఆర్ టి-పీసీఆర్ ఆధారిత కిట్ ను అభివృద్ధి చేయడం జరిగిందని చెన్నైకి చెందిన వైద్య పరికరాల సంస్థ Trivitron Healthcare ప్రకటించింది. చెన్నై: మంకీపాక్స్ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళన మధ్య, చెన్నైకి చెందిన వైద్య పరికరాల సంస్థ ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి రియల్ టైమ్ ఆర్‌టి-పిసిఆర్ ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఇది నాలుగు రంగుల్లో ఉంటుందని, ఈ కిట్ లో ఉన్న ఓ ట్యూబ్ ద్వారా.. పరీక్ష చేయవచ్చని తెలిపింది. మశూచీ, మంకీపాక్స్ ల మధ్యనన్న తేడాలను సైతం గుర్తిస్తుందని పేర్కొంది.

దీనికంతటికీ కేవలం ఓ గంట సమయం మాత్రమే పడుతుందని సంస్థ తెలిపింది. తడి, పొడి శ్వాబ్ శాంపిల్స్ ను వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియాలో తీసుకుని టెస్టు చేయవచ్చని సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు అధికమౌతున్నాయి. 20 దేశాల్లో మొత్తం 200 కేసులు నమోదయ్యాయని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) శుక్రవారం ప్రకటించింది. ఈ సంఖ్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. లాటిన్ అమెరికాలో తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు. భారతదేశం కూడా అలర్ట్ అయ్యింది. 

మరిన్ని వార్తల కోసం : -

మూడో రోజు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం


ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్‌ క్యాడెట్ల కవాతు