![మీరు గ్రేట్ : 50 మంది ఉద్యోగులకు కార్లు ఇచ్చిన ఐటీ కంపెనీ](https://static.v6velugu.com/uploads/2024/01/chennai-based-it-firms-head-gifts-brand-new-car-to-50-employees_NyhSF1anqr.jpg)
చెన్నైకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అధినేత 50 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఐటీ సంస్థ వ్యవస్థాపకుడు మురళి.. కొంతమంది ఉద్యోగులు మొదటి నుంచి తన వెంటే ఉన్నారన్నారు. మొదటి నుంచి తనతో పనిచేసిన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు.
మురళి తన భార్యతో కలిసి 2009లో కంపెనీని స్థాపించారు. తాను, తన భాగస్వామి ఈ కంపెనీలో వాటాలను కలిగి ఉన్నామని.. ఇప్పుడు తాము 33 శాతం వాటాలను అందించే షేర్లను దీర్ఘకాలిక ఉద్యోగులకు మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తాము వెల్త్ షేరింగ్ ప్రోగ్రామ్ కింద తమ ఉద్యోగులకు 50 కార్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఉద్యోగులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 2023లో 100 కార్లను బహుమతిగా ఇచ్చిందని సంస్థ అధిపతి తెలిపారు.
2023 ఫిబ్రవరిలో, అహ్మదాబాద్‌కు చెందిన ఒక ఐటీ సంస్థ 13 మంది ఉద్యోగులకు వారి కృషి, సంస్థ లక్ష్యం పట్ల ఉన్న అంకితభావంతో కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ ఉద్యోగులు సంస్థ ప్రారంభం నుంచి ఉన్నారు. తమ ఉద్యోగుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా వారికి కార్లను బహుమతిగా ఇస్తున్నామని, తాము సృష్టించిన సంపదను తమ ఉద్యోగులతో పంచుకోవాలనుకున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ రమేష్ మరాంద్ తెలిపారు.