చెన్నైకి చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్ ఫర్ట్ లక్ష్మణ్ ముత్తయ్య ఇన్ స్టాగ్రామ్ లో ఓ బగ్ ను గుర్తించి నగదు బహుమానం అందుకున్నాడు. ఫేస్ బుక్ కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో లోపం ఉందని, ఎవరి అకౌంట్ నైనా ఈజీగా హ్యాక్ చేసే అవకాశముందని లక్ష్మణ్ గుర్తించాడు. పాస్ వర్డ్ రీసెట్ ఆప్షన్ ద్వారా ఇతరుల అకౌంట్లలోకి పర్మిషన్ లేకుండా ఎంటరైయ్యేందుకు అవకాశముందని లక్ష్మణ్ తన పరిశోధన ద్వారా తెలిపాడు.
పాస్ వర్డ్ రీసెట్ చేసే సమయంలో ఫోన్ కు గానీ, ఈమెయిల్ కు గానీ వచ్చే రికవరీ కోడ్ ను తెలుసుకోవడం ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద కష్టంకాదని లక్ష్మణ్ ఫేస్ బుక్ నిపుణులకు వివరించాడు. ఈ చెన్నై నిపుణుడి సూచనలకు వెంటనే స్పందించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎక్స్ ఫర్ట్స్ వెంటనే ఆ బగ్ ను ఫిక్స్ చేశారు. పాస్ వర్డ్ రీసెట్ ప్రక్రియలోని లోపాన్ని సరిచేశారు. అంతేకాకుండా… ఎంతో విలువైన సూచన చేశాడంటూ లక్ష్మణ్ కు రూ.20 లక్షల రివార్డు కూడా అందించారు.