అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్

చెన్నై: విద్యా, అమెరికా వీసా అభ్యర్థులకు ఉపాధి ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినందుకు హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై యూఎస్ కాన్సెలేట్ అందిన ఫిర్యాదు మేరకు చెన్నై సిటీ పోలీసులు సెంట్రల్ క్రైం బ్రాంచ్ ( సీసీబీ) ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ వింగ్ ( ఎఫ్ ఐడబ్ల్యూ) దర్యాప్తు ప్రారంభించింది. 

గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ అండ్ మేనేజ్ మెంట్ జారీ చేసిన హోటల్ మేనేజ్ మెంట్ లో డిప్లమా సర్టిఫికెట్ , హైదరాబాద్ లోని మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ లో నకిలీ ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్ చూపిస్తూ అజయ్ కుమార్ భండారీ అనే వ్యక్తి వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. 

హైదరాబాద్ కు చెందిన డ్రీమ్  ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ  ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా సర్టిఫికెట్లు ఫోర్జరీ చేస్తున్నట్లు దర్యాప్తు లో తేలింది. ఈ సంస్థకు చెందిన బాల నందేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ లో సైబెల్ టెక్నాలజీస్ నడుపుతున్న మరో వ్యక్తి కొప్సే మహేష్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
నకిలీ సర్టిఫికెట్లు అందించినందుకు వీరిద్దరూ ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వెల్లడైంది.