వినూత్న చర్య: చెన్నై కార్పొరేషన్లో చెత్త డంపింగ్ యార్డులలో AI కెమెరాల నిఘా

వినూత్న చర్య: చెన్నై కార్పొరేషన్లో చెత్త డంపింగ్ యార్డులలో AI  కెమెరాల నిఘా

బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్వహణకు చెన్నై కార్పొరేషన్ వినూత్న పద్దతులను అనుసరిస్తోంది. కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను నివారించేందుకు ఇప్పటికే జరిమానాలు విధి స్తున్న చెన్నై పురపాలక సంస్థ.. తాజాగా బహిరంగంగా చెత్త వేస్తున్న వారిని గుర్తించేందుకు గ్రేటర్ చెన్నైన కార్పొరేషన్ పరిధిలో చెత్త హాట్ స్పాట్ లను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.  

గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ పర్యవేక్షించేందుకు చెన్నై కార్పొరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో కూడిన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ కుమార గురుబరన్ చెప్పారు. ఇవి చెత్త హాట్ స్పాట్ లను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ కెమెరాలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ తో చేయబడి ఉంటాయన్నారు. 

Also Read :- రన్నింగ్ RTC బస్సులో మంటలు

మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. ఇప్పటికు చెత్తను డంపింగ్ చేసిన 480 కేసుల్లో చెన్నై కార్పొరేషన్ స్పాట్ ఫైన్ కింద రూ.17.97 లక్షలు వసూలు చేసింది. కార్పొరేషన్ లోని కోడంబాక్కంలో 2లక్షల 25వేల 500, రోయపురం జోన్ లో 2లక్షల 14వేల 400 రూపాయల జరిమానా వసూలు చేసింది.