ఇంట్లో పని పిల్లను కాల్చి.. వాతలు పెట్టి చంపేసింది ఈ జంట

ఇంట్లో పని పిల్లను కాల్చి.. వాతలు పెట్టి చంపేసింది ఈ జంట

ఇక్కడ ఓ 15ఏళ్ల బాలికకు కఠినమైన చట్టాలు ఉన్నా.. తీవ్ర అన్యాయం జరిగింది. ఆమెకు బాల్యవివాహమై.. అంతలోనే భర్త చనిపోయాడు. దిక్కుతోచని స్థిలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఓనర్లు రాసిరంపాన పెడితే.. వారి చిత్రహింసలకు తట్టుకోలేక తనువు చాలించింది ఆ బాలిక. చిన్న పిల్లలతో పని చేయించుకోవడమే తప్పు. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మైనర్ బాలికపై ఓ జంట పైచాచికత్వం ప్రదర్శించారు. సిగరెట్ పీకలు, ఐరన్ రాడ్లతో కాల్చి చిత్రహింసలు పెట్టారు.. చివరికీ 15ఏళ్ల బాలిక టాయిలెట్‌లో శవమై కనిపించింది. చెన్నైలో జరిగిన ఓ బాధకరమైన ఘటన అందరినీ కన్నింటి పర్యాంతం చేస్తోంది. 

తంజావూరు జిల్లాకు చెందిన వితంతువు బాలికను చెన్నైలో మహ్మద్ నిషాద్, నసియా అనే జంట మనిమనిషిగా పెట్టుకున్నారు. అమింజికరై ప్రాంతంలోని మెహతా నగర్‌లోని ఒక ఫ్లాట్‌లోని టాయిలెట్ లో బాలిక గాయాలతో చనిపోయింది. వారు చిన్న పిల్ల అని కూడా చూడకుండా బాలికపై క్రూరత్వం చూపించారు. సిగరెట్లు, ఐరన్ వస్తువులు కాల్చి పనిమనిషికి వాతలు పెట్టారు. మొగడుపెళ్లాం కలిసి తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురిచేశారు. పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. 

ALSO READ : కూతురిని వేధిస్తున్నాడని... అల్లుడిని హత్య చేసిన అత్త

ఈ కేసుకు సంబంధించి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహ్మద్ నిషాద్, నసియా అనే జంట, బాలిక మృతదేహాన్ని తమ టాయిలెట్‌లో వదిలి వ్యక్తి సోదరి ఇంటికి పారిపోయారు. వారి లాయర్‌ బాలిక మృతిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలిక మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కిల్‌పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.