ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్..ఐదుగంటలు ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్..ఐదుగంటలు ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

చెన్నై ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో నిలిచిపోయింది.సుమారు ఐదుగంటలపాటు విమానంలో ప్రయాణికులు ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టెక్నికల్ సమస్యలు తలెత్తాయి..గంటపడుతుందని మొదట ప్రకటించిన ఎయిర్ ఇండియా సిబ్బంది.. దాదాపు ఐదు గంటలఅయినా విమానం బయల్దేరకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విమానం లోపల గందరగోళంపై  Xలో వీడియో షేర్ చేయడంతో వైరల్ అయింది. 

చెన్నై-నుంచి ఢిల్లీ వెళ్తున్న  ఎయిర్ ఇండియా విమానం మంగళవారం దాదాపు ఐదు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు.  మొదట కనీసం 90 నిమిషాలు విమానంలోనే వేచి ఉండమని X (గతంలో ట్విట్టర్)లో సోషల్ మీడియా పోస్ట్ పేర్కొంది ఎయిర్ ఇండియా. తరువాత విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులను దిగమని కోరారు. దీంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. దీనికి సంబంధించి ప్రయాణికులు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.  

►ALSO READ | పుట్టిన పిల్లలు మిస్సయితే.. ఆస్పత్రి లైసెన్స్ రద్దు : సుప్రీంకోర్ట్ సంచలన ఆదేశాలు

ఈ వీడియోలో సీట్లలో కొందరు, నిల్చుని కొందరు ప్రయాణికులు విమానం టేకాఫ్ అయ్యేందుకు వేచి చూస్తున్నారు. విమానం నిలిచిపోవడం ప్రయాణికులు అసహనం వ్యక్తం చేయడంతో విమానంలో గందరగోళం నెలకొంది.

విమానం ఆలస్యంపై ఎయిర్ ఇండియా స్పందించింది.. సాంకేతిక లోపం వల్ల విమానం టేకాఫ్ కు ఆలస్యం అయింది.. త్వరలో బయల్దేరుతుంది. మావల్ల  కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నామని పోస్ట్ చేసింది.