Viral news:ఇంత చిన్నదానికేనా: కస్టమర్ తిట్టాడని..డెలివరీ బాయ్ ఆత్మహత్య

Viral news:ఇంత చిన్నదానికేనా: కస్టమర్ తిట్టాడని..డెలివరీ బాయ్ ఆత్మహత్య

ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలతో ప్రాణాలు తీసుకోవడం లేదా ప్రాణాలు తీయడం వంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత క్షిణాకావేశంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమించిన వారు మోసం చేశారని ఒకరు..తల్లిదండ్రులు మందలించారని మరొకరు..సెల్ ఫోన్ కొనివ్వలేదని.. ఆఫీసుల్లో బాస్ తిట్టాడని ఇంకొకరు.. ఇలా చిన్న చిన్న కారణాలతో యూత్ ప్రాణాలు తీసుకోవడం తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. తాజాగా చైన్నైలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 19 యేళ్ల టీనేజర్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కొరట్టూరుకు చెందిన జె పవిత్రన్ అనే యువకుడు స్థానికంగా ఉండే  ఫుడ్ అగ్రిగేటర్ లో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. బీకామ్ చదవుతున్న పవిత్రన్.. విధుల్లో భాగంగా కస్టమర్లకు కిరాణా సరుకులు డెలివరీ చేస్తుంటాడు. 

అయితే సరుకుల డెలివరీ ఆలస్యమైనందుకు కస్టమర్, పవిత్రన్ తో గొడవపడ్డాడు. ఆలస్యంగా సరుకులు డెలివరీ చేసినందుకు మహిళ కస్టమర్, పవిత్రన్ ను గట్టిగానే తిట్టింది.

కస్టమర్, పవిత్రన్ గొడవ అంతటితో ఆగలేదు.. మరుసటి రోజు పవిత్రన్ పనిచేసే డెలివరీ ప్లాట్ ఫాంలో పవిత్రన్ పై పిర్యాదు చేసింది ఆ మహిళ. ఇంకెప్పుడు పవిత్రన్ తన సరుకుల డెలివరీలకు పంపొద్దని చెప్పింది. దీంతో పవిత్రన్ పై ఆ షాపు యజమాని చర్యలు కూడా తీసుకున్నాడు.

దీంతో కోపంతో పవిత్రన్ .. ఆ మహిళ కస్టమర్ ఇంటికి వెళ్లి రాయితో ఇంటి కిటికీ అద్దాలు పగల గొట్టాడు. దీంతో ఆమె.. పవిత్రన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు పోలీసులు పవిత్రన్ విచారణకు పిలిచి గట్టిగా మందలించారు. పవిత్రన్ తోపాటు అతని తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి మందలించారు.

దీంతో మనస్థాపం చెందిన పవిత్రన్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు దారి తీసిన పరిస్థితులను ఓ లెటర్ లో రాసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.