చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ లో మూడో విజయం అందుకున్నాడు. శుక్రవారం జరిగిన మాస్టర్స్ నాలుగో రౌండ్లో అర్జున్ 52 ఎత్తుల వద్ద అమిన్ తబాటబాయి (ఇరాన్)పై గెలిచాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ మూడున్నర పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
అరవింద్ చిదంబరం, లెవాన్ అరోనియన్ (అమెరికా) మధ్య జరిగిన గేమ్ 17 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. వాచిర్ లాగ్రెవ్, విదిత్ సంతోష్ మధ్య జరిగిన గేమ్ కూడా 50 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. చాలెంజర్స్ కేటగిరీలో ద్రోణవల్లి హారిక మరో ఓటమిని చవి చూసింది. మురళీ కార్తికేయన్‌తో జరిగిన గేమ్‌లో హారిక 43 ఎత్తుల వద్ద ఓటమిపాలైంది. పురాణిక్ అభిమన్యు.. లియోన్ లూక్, సాద్వాని రౌనక్–ప్రాణేశ్ మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఆర్. వైశాలిపై 59 ఎత్తులతో నెగ్గిన ప్రణవ్ 4 పాయింట్లతో నంబర్‌వన్ ప్లేస్‌లో ఉన్నాడు.