
చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తొలి డ్రా నమోదు చేశాడు. బుధవారం అమెరికా గ్రాండ్ మాస్టర్ లెవోన్ అరోనియన్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను 36 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. దీంతో ఇద్దరు ప్లేయర్లకు చెరో అర పాయింట్ లభించింది. ఈ రౌండ్ తర్వాత అర్జున్, వాచిర్ లాగ్రెవ్, తబాతబియా సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. చాలెంజర్ సెక్షన్‌లో ద్రోణవల్లి హారిక 44 ఎత్తుల వద్ద లియోన్ మెండోన్కా చేతిలో ఓడింది.