చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌ విజేత అరవింద్‌‌ చిదంబరం

చెన్నై  గ్రాండ్‌‌ మాస్టర్స్‌ విజేత అరవింద్‌‌ చిదంబరం

చెన్నై: చెన్నై గ్రాండ్‌‌ మాస్టర్స్‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఎరిగైసి అర్జున్‌‌ మూడో స్థానంతో సరిపెట్టగా.. అరవింద్‌‌ చిదంబరం టైటిల్‌‌ సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఆఖరిదైన ఏడో రౌండ్‌‌లో అర్జున్‌‌.. వాచిర్‌‌ లాగ్రెవ్‌‌తో జరిగిన గేమ్‌‌ను 38 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. మరో గేమ్‌‌లో అరవింద్‌‌ 64 ఎత్తులతో పర్హమ్‌‌ను ఓడించాడు. 

లెవాన్‌‌ అరోనియన్‌‌, మహ్మద్‌‌ అమిన్‌‌ మధ్య జరిగిన గేమ్‌‌ 15 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. దీంతో అర్జున్‌‌, అరోనియన్‌‌, అరవింద్‌‌ తలో నాలుగున్నర పాయింట్లతో నిలిచారు. ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్‌‌ ప్లే ఆఫ్స్‌‌ నిర్వహించగా తొలి గేమ్‌‌లో అరోనియన్‌‌ను ఓడించిన అరవింద్‌‌.. తర్వాతి గేమ్‌‌ను డ్రా చేసుకుని టైటిల్‌‌ను సాధించాడు. ఈ ముగ్గురికి తలో రూ. 11 లక్షల క్యాష్‌‌ ప్రైజ్‌‌ లభించింది. చాలెంజర్స్‌‌లో ప్రణవ్‌‌ ఐదున్నర పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచి టైటిల్‌‌ సొంతం చేసుకున్నాడు.  చివరి రౌండ్‌‌లో ప్రణవ్‌‌–మెండోకా మధ్య జరిగిన గేమ్‌‌41 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. ద్రోణవల్లి హారిక, ప్రాణేశ్‌‌ మధ్య జరిగిన గేమ్‌‌ కూడా 52 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది.