Chennai AC local Train: చెన్నైలో ఫస్ట్ AC లోకల్ రైలు..సౌకర్యాలు మామూలుగా లేవు

Chennai AC local Train: చెన్నైలో ఫస్ట్ AC లోకల్ రైలు..సౌకర్యాలు మామూలుగా లేవు

చెన్నైలో తొలి AC లోకల్ రైలు పట్టాలెక్కింది. శనివారం (ఏప్రిల్ 19) ఉదయం చెన్నై బీచ్ నుంచి చెంగల్పట్టు కారిడార్ లో పరుగులు పెట్టింది. శనివారం ఉదయం 7 గంటలకు రైల్వే అధికారులు జెండా ప్రారంభించారు. ప్రయాణికులు ఈ లోకల్ ట్రైన్ లో ప్రయాణాన్ని ఆస్వాదించారు. వేసవి కాలంలో ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) ప్రారంభించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.

A great respite for #Chennai commuters!

దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ ఈ సర్వీస్ ను నడుపుతోంది. చెన్నై సిటీ సబర్బన్ రైలు నెట్ వర్క్ లో ఇది మరో మైలురాయి.లోకల్ ట్రైన్లలో ఎయిర్ కండిషన్ ఏర్పాటు దక్షిణ భారత దేశంలో ఇది మొదటిదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో సాధారణ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) లకంటే మరిన్ని ఫీచర్లనుకలిగి ఉంది. ఆటోమేటిక్ డోర్లు, ప్రయాణికులు సమాచార వ్యవస్థ వంటి ఫీచర్లు ఈ కొత్త రైలులో ఉన్నాయి. 

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసిన అత్యాధునిక 12-కార్ల AC EMUలో సుమారు 5000 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. అధిక సామర్థ్యంతో మెట్రో లాంటి సౌకర్యాన్ని అందించే అనేక లేటెస్ట్ స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ప్రయాణీకులకు ఇబ్బంది లేని, ఆహ్లాదకరమైన ప్రయాణ అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

ఈ ట్రైన్ లో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ సీటింగ్, పనోరమిక్ వైడ్ గ్లాస్ విండోస్, బ్యూటిఫుల్ లైటింగ్ సిస్టమ్, GPS-ఆధారిత LED డిస్ ప్లేలు, CCTV నిఘా ,ఎమర్జెన్సీలో ప్రయాణీకుల టాక్-బ్యాక్ సిస్టమ్,అంతరాయం లేకుండా కదలడానికి సీలు చేసిన గ్యాంగ్‌వేలు ఉన్నాయి. ఈ రైలులో 35 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగల ఎలక్ట్రో న్యూమాటిక్ బ్రేక్‌లు, అత్యుత్తమ రైడింగ్ సౌకర్యం కోసం ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి. 

AC EMU సర్వీస్ ను మొదట ముంబైలో ప్రారంభించారు. ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు,మహిళా ప్రయాణికులలో మంచి ఆదరణ పొందింది.ముంబై సక్సెస్ తర్వాత చెన్నై బీచ్ నుంచి -చెంగల్పట్టు మధ్య దక్షిణ భారతంలో తొలిసారి AC EMU సర్వీస్ ను ప్రారంభించామని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు.  

రానున్న రోజుల్లో చెన్నై బీచ్- నుంచి చెంగల్పట్టు ,చెన్నై బీచ్ నుంచి -తాంబరం రెండూ ఒకే సెక్టార్ల మధ్య సర్వీసులు నడుపుతారు. చెన్నై బీచ్ నుంచి -చెంగల్పట్టు (4 సర్వీసులు) ,చెన్నై బీచ్ నుంచి -తాంబరం (2 సర్వీసులు) ఆదివారాలు మినహా వారానికి  ఆరు రోజులు మొత్తం ఆరు సర్వీసులు నడుపుతారు. 

దక్షిణ రైల్వే విడుదల చేసిన ఛార్జీల ప్రకారం..10 కి.మీ వరకు దూరానికి కనీస టికెట్ ధర రూ. 35,అత్యధికంగా 56 నుంచి -60 కి.మీ.లకు రూ.105 ఉంటుంది. నెలవారీ సీజన్ టికెట్ దూరాన్ని బట్టి ధరలు రూ.620 నుండి రూ.2115 వరకు ఉంటాయి.