చెన్నై మెట్రోలో డ్రైవర్‌ లేకుండా నడిచే రైళ్లు!.. మరి ఎలా నడుస్తాయి

చెన్నై మెట్రోలో డ్రైవర్‌ లేకుండా నడిచే రైళ్లు!.. మరి ఎలా నడుస్తాయి

చెన్నై మెట్రో రికార్డు సృష్టించబోతోంది. త్వరలో డ్రైవర్ లెస్ ట్రైన్లు చెన్నై మెట్రోలో పట్టాలెక్కనున్నాయి. ఇందులో భాగంగా 36 డ్రైవర్ లెస్ ట్రైన్లు చెన్నైకి చేరనున్నాయి. ఫ్రెంచ్ రైళ్ల తయారీ దారు సంస్థ అల్స్టన్ ఈ ట్రైన్లు తయారు చేస్తుంది. ఈ రైళ్లను మెట్రోపోలిస్ అని పిలుస్తారు. ఈ ట్రైన్లు  రెండేసి బోగీలను కలిగి ఉంటాయి. చెన్నైలోని పూనమెల్లి బైపాస్ నుంచి లైట్ హౌజ్ వరకు మొత్తం 26 కిలోమీటర్లు క్యారిడార్ లో ఈ రైళ్లను నడుపనున్నాయి. 

ఈ ట్రైన్లు ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ తో నడుస్తాయని తయారీ సంస్థ ఆల్ స్టన్  ప్రతినిధులు చెబుతున్నారు. ఇది పూర్తి డ్రైవర్ లేకుండా నడిచే రైలు.. అందుకు అనుగుణంగా టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు. 

డ్రైవర్ లేకుండా ఎలా నడుస్తుందంటే... 

ఈ రైల్లు కచ్చితంగా డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు.. అయితే పూర్తి మానవ ప్రమేయం లేకుండా నడిచేవి కావు. వీటిని కంట్రోల్ సెంటర్ నుంచి అపరేట్ చేస్తారు. ఇది కంట్రోల్ సెంటర్ లోని ఆపరేటర్ల పర్యవేక్షణలో నడుస్తుంది. ప్రయాణికులతో ఆపరేటర్ మాట్లడటానికి , ఆదేశాలు జారీ చేయడానికి మెట్రో ఇంటర్ కామ్ సిస్టమ్ లను వినియోగిస్తారు. 

ALSO READ | ‘మహా’ సంగ్రామంలో ‘పద్మ’వ్యూహం