ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది సేఫ్
  • ఫ్యుయెల్ చాలక శంషాబాద్​ ఎయిర్​పోర్టులో దిగిన చెన్నై– పుణె విమానం.

శంషాబాద్, వెలుగు: చెన్నై నుంచి పుణెకు బయలుదేరిన ఎయిర్​ఇండియాకు చెందిన IX555 విమానాన్ని పైలట్ శనివారం మధ్యాహ్నం శంషాబాద్​ఎయిర్​పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్​చేశారు. ఆ సమయంలో విమానంలో180 మంది ప్యాసింజర్లు ఉన్నారు. చెన్నై ఎయిర్​పోర్టులో విమానం టేక్​ఆఫ్​అయిన కొద్దిసేపటికి ఇంధన సరిపడా లేదని పైలట్​గుర్తించారు. వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చి, విమానాన్ని దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్​చేశారు. దీంతో 180 మంది ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు.