చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు

ఐపీఎల్లో  చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సృష్టించింది. ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డును ధోని టీమ్ తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే  అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ సార్లు స్కోరు చేసిన జట్టుగా సీఎస్కే అవతరించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 24 సార్లు 200 కు పైగా స్కోరు సాధించడం విశేషం. 

217 పరుగుల స్కోరు..

ఐపీఎల్ 2023లో ఏప్రిల్ 3వ తేదీ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో  చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగులు సాధించింది.  ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ ( 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు), డేవాన్‌ కాన్వే (29 బంతుల్లో 5 ఫోర్లు,2 సిక్సులతో 47 పరుగులు), శివమ్‌ దుబె ( 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు 27 పరుగులు) సాధించారు. దీంతో  చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగులు చేసింది.  200 కంటే ఎక్కువ పరుగులు చేయడం చెన్నైకు ఇది 24వ సారి కావడం విశేషం.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 5 సార్లు 220 కంటే ఎక్కువ స్కోర్లు సాధించింది. మరో 5 సార్లు 210 నుంచి 220 వరకు స్కోర్లు చేసింది.మిగిలినవన్నీ 200 నుంచి 210 స్కోర్లు.