IPL Retention 2025: ధోనీకి రూ. 4 కోట్లు.. ఐదుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

IPL Retention 2025: ధోనీకి రూ. 4 కోట్లు.. ఐదుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2025 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ అధికారికంగా వచ్చేసింది. ఐదుగురిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. 

ALSO READ | ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు

చెన్నై 5 గురి కోసం రూ. 55 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వారు రూ. 65 కోట్లతో మెగా ఆక్షన్ లోకి అడుగుపెట్టనున్నారు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండేలపై చెన్నై ఆసక్తి చూపించలేదు. వారు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లోకి రానున్నారు. ఒక ఆటగాడినే (ఒక క్యాప్డ్ లేదా అన్‌క్యాప్డ్ ప్లేయర్) RTM కార్డు వాడి తీసుకోవాల్సి ఉంటుంది.