LSG vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ప్లేయింగ్ 11 నుంచి కాన్వే, అశ్విన్ ఔట్!

LSG vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ప్లేయింగ్ 11 నుంచి కాన్వే, అశ్విన్ ఔట్!

ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం (ఏప్రిల్ 14) కీలక మ్యాచ్ కు సిద్ధమైంది . లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో ఆతిధ్య లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే లక్నోపై చెన్నై తప్పక గెలవాల్సి ఉంది. ఇప్పటివరకు చెన్నై ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిచి ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మరోవైపు లక్నో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించింది. 

ALSO READ : RR vs RCB: బెంగళూరుకు రా.. నీకు గిఫ్ట్ రెడీగా ఉంది: శ్రీలంక క్రికెటర్‌కు మాటిచ్చిన కోహ్లీ

ప్లేయింగ్ 11 విషయానికి వస్తే చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కాన్వే స్థానంలో ఓవర్ టన్.. అశ్విన్ స్థానంలో రషీద్ వచ్చాడు. లక్నో జట్టులో గత మ్యాచ్ లో దూరంగా ఉన్న మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో హిమ్మత్ సింగ్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): 

ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, MS ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ