
ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. లీగ్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో అతిథ్య చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత సూర్యకుమార్ సేన బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హర్ధిక్ పాండ్యా నిషేధం కారణం ఈ మ్యాచ్ దూరం అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
ఇక, రోహిత్, ధోని ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తలా ఫ్యాన్స్ అయితే.. ధోనిని మళ్లీ ఎప్పుడెప్పుడా గ్రౌండ్ లో చూడాలా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ కోసం తలా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫారెన్ ప్లేయర్ల విషయానికి వస్తే చెన్నై రచీన్ రవీంద్ర, ఎల్లిస్, నూర్ అహ్మద్, సామ్ కరణ్ లతో బరిలోకి దిగుతుంది. మరోవైపు ముంబై బోల్ట్, రికెల్టను, విల్ జాక్స్, సాంట్నర్ లు తుది జట్టులో స్థానం సంపాదించారు.
ALSO READ : ఇదేం కొట్టుడు సామీ: ఉప్పల్లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్