CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. తుది జట్టులో రెండు మార్పులు

CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. తుది జట్టులో రెండు మార్పులు

ఐపీఎల్ లో ఆదివారం (మార్చి 30) రెండో ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ  టోర్నీలో చెన్నై ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ గలవగా ఆడిన రెండు మ్యాచ్ ల్లో రాజస్థాన్ ఓడిపోయింది. చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. దీపక్ హుడా స్థానంలో విజయ్ శంకర్.. సామ్ కరణ్ స్థానంలో జెమీ ఓవర్ టన్  ప్లేయింగ్ 11 లోకి వచ్చారు. మరో వైపు రాజస్థాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): 

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), జామీ ఓవర్టన్, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్