ఐపీఎల్ లో భాగంగా నేడు మరో సూపర్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. చెన్నై జట్టును పక్కనపెడితే గుజరాత్ కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది.
ఈ మ్యాచ్ లో ఓడిపోతే గిల్ సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడితే 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరో వైపు చెన్నై సూపర్ ఫామ్ లో ఉంది. ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచినా ప్లే బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.
ఈ మ్యాచ్ లో చెన్నై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. పేసర్ గ్లేస్సన్ ప్లేస్ లో రచీన్ రవీంద్రకు చోటు దక్కింది. గుజరాత్ జట్టులో లిటిల్ స్థానంలో కార్తీక్ త్యాగి ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.