ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్‌కే).. సోషల్ మీడియాలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. అంతకంతకూ అభిమానుల ఆదరణ చూరగొంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ జట్టు ఏకంగా 15 మిలియన్ల ఫాలోవర్లను దాటింది. దీంతో ఇన్‌స్టాలో 15 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా సీఎస్‌కే చరిత్ర సృష్టించింది. కాగా ఇన్‌స్టాలో చెన్నైసూపర్ కింగ్స్ ఇప్పటివరకు 15,348 పోస్టులు చేసింది.
ఈ జాబితాలో 13.5 మిలియన్ల ఫాలోవర్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రెండో స్థానంలో బెంగళూరు రెండో స్థానంలో ఉండగా.. 13.2 మిలియన్ల ఫాలోవర్లతో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 5 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ముంబైకి నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతాకు ఫాలోవర్ల సంఖ్యలో తేడా ఏకంగా 8 మిలియన్లకు పైగా ఉండడం గమనార్హం.
ట్విట్టర్(ఎక్స్)లోనూ చెన్నైయే
ట్విట్టర్ ఫాలోవర్లలోనూ చెన్నైసూపర్ కింగ్స్‌దే అగ్రస్థానం. ఏకంగా 10.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. తరువాత 8.2 మిలియన్ల ఫాలోవర్లతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో, 7.1 మిలియన్ల ఫాలోవర్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో ఉన్నాయి.
నమస్కారం విశాఖపట్నం! Let the whistles begin 🏏🥳#DCvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/XYhGBUN6Q2
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024