ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ నార్మల్ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (24), శివమ్ దుబే (25), అంబటి రాయుడు (23) పరుగులతో రాణించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే తొలి వికెట్కు 32 పరుగులు జోడించారు. అయితే 10 పరుగులు చేసిన కాన్వే అక్షర్ పటేల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వా కొద్దిసేపటికే రుతురాజ్ను కూడా అక్షర్ పటేల్ బుట్టలో వేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మోయిన్ ఆలీ 7 పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ చేతికి చిక్కాడు. మరికొద్ది సేపటికే రహానే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో చెన్నై 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న దుబే..రాయుడు
ఈ సమయంలో శివబ్ దుబే జట్టును ఆదుకున్నాడు. అంబటి రాయుడు కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అంబటి రాయుడుతో కలిసి 5వ వికెట్కు 36 పరుగులు జోడించాడు. అయితే 25 పరుగులు చేసిన దుబేను మిచెల్ మార్ష్ ఔట్ చేవాడు. కొద్దిసేపటికే అంబటి రాయుడు (23) కూడా ఔటయ్యాడు. చివర్లో జడేజా (21), ధోని (20) మెరుపులు మెరిపిచడంతో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ మార్ష్ 3 వికెట్లు దక్కించకకున్నాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకున్నాడు. లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.