ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 26) పటిష్ట జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో సూపర్ కింగ్స్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై చెన్నై నెగ్గితే.. ముంబై ఇండియన్స్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్తుంది.
ముగ్గురు స్పిన్నర్లతో గుజరాత్
సాధారణంగా చెన్నైలోని వికెట్ స్లోగా ఉంటుంది. ఇక్కడి పిచ్ లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయి. దీంతో ఈ మ్యాచ్ లో గుజారాత్ జట్టు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తుంది. వీరితో పాటు ఆల్ రౌండర్ రాహుల్ టివాటియా ఉండనే ఉన్నాడు. స్పిన్నర్లతోనే చెన్నైకు చెక్ పెట్టాలను టైటాన్స్ భావిస్తుంది. గత మ్యాచ్ లో చోటు దక్కని నూర్ అహ్మద్.. ఓమార్జాయి స్థానంలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
పతిరానాకు చోటు దక్కేనా
మొదటి మ్యాచ్ లో గెలిచి ఊపు మీద ఉన్న చెన్నై జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. శ్రీలంక పేస్ బౌలర్ పతిరానా కోలుకోవడంతో అతడు ఈ మ్యాచ్ లోకి బరిలోకి దిగుతాడో లేదో చూడాలి. తొలి మ్యాచ్ లో పతిరానా స్థానంలో వచ్చిన ముస్తాఫిజుర్ రెహమాన్ నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో తుది జట్టులో పతిరానాకు చోటు దక్కపోవచ్చు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న తుషార్ దేశ్ పాండే స్థానంలో శార్దూలు ఠాకూర్ కు అవకాశం దక్కొచ్చు.
Clash of the Titans! #CSK vs #GT is all set for an epic battle in #IPL2024 Who will emerge victorious? #Cricket #MatchDay #T20 #ChennaiSuperKings #GujaratTitans pic.twitter.com/E8m1bYn8pj
— Sportbetpro (@Sportbet_pro) March 26, 2024