CSK vs MI: గైక్వాడ్, ఖలీల్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

CSK vs MI: గైక్వాడ్, ఖలీల్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

చెపాక్ వేదికగా ఆదివారం (మార్చి 23) ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై అద్భుతంగా ఆడిన చెన్నై సునాయాస విజయాన్ని అందుకుంది. దీంతో ఎప్పటిలాగే ముంబై తమ టోర్నీ ప్రారంభ మ్యాచ్ ఓడిపోగా.. చెన్నై గెలుపుతో సీజన్ స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు క్రికెటర్లపై బాల్ టాంపరింగ్ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కలిసి బాల్ టాంపరింగ్ చేశారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. 

ALSO READ | ధోనిని స్లెడ్జ్ చేసిన మాజీ CSK ప్లేయర్.. గ్రౌండ్‎లోనే బ్యాట్‎తో కొట్టబోయిన తలా..!

ఈ బ్లాక్ బస్టర్ సమరంలో ముంబై టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది. తొలి ఓవర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ స్టార్ట్ చేయడానికి ముందు  కెప్టెన్ గైక్వాడ్.. ఖలీల్ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఖలీల్ వెనక్కి తిరిగి జేబులో ఏదో తీస్తున్నట్టు.. గైక్వాడ్ కూడా అతని దగ్గర నుంచి ఏదో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీడియోలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఈ విషయం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొంతమంది మాత్రం వీరిద్దరూ బాల్ టాంపరింగ్ చేశారని గట్టిగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు కొంతమంది వీరిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. 

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం బాల్ టాంపరింగ్ ఆరోపణలో నిజం లేదని.. గైక్వాడ్ కొత్త బంతిని ఖలీల్ కు ఇవ్వడానికి వచ్చాడని చెబుతున్నారు. ఖలీల్ తన చేతికున్న ఉంగరాన్ని గైక్వాడ్ కు ఇచ్చాడని.. అతను తన జేబులో వేసుకున్నాడని చెబుతున్నారు. చెన్నై అంటే నచ్చని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మ్యాచ్ లో ఖలీల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో కీలకమైన రోహిత్ శర్మ వికెట్ కూడా ఉంది. 2016, 2017లో జట్టు యజమాని స్పాట్ ఫిక్సింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ జట్టును బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. 

చెన్నై వేదికగా చెపాక్  స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాటు.. ఓపెనర్ రచీన్ రవీంద్ర( 45 బంతుల్లో 65:2 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ గైక్వాడ్ (53) హాఫ్ సెంచరీలతో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లను 158 పరుగులు చేసి గెలిచింది.