
చెన్నై: ఈ ఏడాది నిర్వహించే చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఒలింపియాడ్ రష్యాలో జరగాల్సి ఉండగా.. ఉక్రెయిన్ పై ఆ దేశం యుద్ధం నేపథ్యంలో టోర్నీని ఫిడె అక్కడి నుంచి భారత్ లోని చెన్నైకి తరలించింది. ఒలింపియాడ్ ఆతిథ్యం కోసం తొలుత ఫిడె బిడ్ లు దాఖలు చేయొచ్చని ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వహణ హక్కుల కోసం అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) బిడ్ దాఖలు చేసింది. ఇందుకు సుమారు రూ.75 కోట్లు (10 మిలియన్ డాలర్లు) హామీ మొత్తాన్ని ఫిడెకు సమర్పించింది. అనంతరం బిడ్స్ ను పరిశీలించిన ఫిడె.. మిగతా దేశాలను కాదని భారత్ వైపు మొగ్గు చూపింది. ఈ టోర్నీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. జూలై చివర్లో ప్రారంభమై ఆగస్టులో పూర్తయ్యేలా షెడ్యూల్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. రెండు వారాల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 190 దేశాల జట్లు బరిలో దిగుతాయి.
⚡ Chennai to host the 2022 Chess Olympiad
— International Chess Federation (@FIDE_chess) March 15, 2022
The FIDE Council has approved the bid presented by the All India Chess Federation @aicfchess to host the 2022 #ChessOlympiad in Chennai, the capital of the Tamil Nadu state.
➡️ https://t.co/Y39HC9vXq2 pic.twitter.com/fLmD2WwRB4
మరిన్ని వార్తల కోసం: