ఈ తల్లికి వందనం : గంజాయి అమ్ముతున్న కొడుకును అరెస్ట్ చేయించిన అమ్మ

ఈ తల్లికి వందనం : గంజాయి అమ్ముతున్న కొడుకును అరెస్ట్ చేయించిన అమ్మ

పిల్లలు ఏదైనా తప్పుచేస్తే తల్లిదండ్రులు వెనుకేసుకొచ్చే ఈరోజుల్లో ఓ తల్లి తప్పు ఎవ్వరు చేసినా తప్పే అని నిరూపించింది. డ్రగ్స్ కు అలవాటు పడిన కొడికుని తల్లి పోలీసులకు పట్టించింది. చెన్నైలో లారీ డ్రైవర్ గా పని చేస్తు్న్న శ్రీరామ్ జంగాయి ఆయిల్ కు అలవాటు పడ్డాడు. అతని ఫ్రెండ్ అరుణ్ తో కలిసి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా సప్లైయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లి భగ్య లక్ష్మీ జూలై 3న ఎంకేబీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు శ్రీరామ్ ఇంటికి రాగానే అతన్ని పట్టుకున్నారు. 

అతని వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 630 ఎంఎల్ గంజాయి నూనె స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ ను పోలీసులు విచారించగా గంజాయి స్మగ్లింగ్ గురించి బయటపెట్టాడు. ఒడిశా నుంచి కార్గో ట్రిప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 300 ఎంఎల్‌ గంజాయిని తీసుకొచ్చినట్లు శ్రీరామ్ చెప్పాడు. కేరళకు చెందిన అరుణ్ అనే వ్యక్తితో దాన్ని అతను కొన్నాడట. చెన్నైలోని మాధవరం ప్రాంతంలోని రౌండ్‌అబౌట్‌లో గుర్తు తెలియని వ్యక్తికి వస్తువును అందజేసినట్లు శ్రీరామ్ తెలిపారు. అతను ఇచ్చిన సమాచారంతో గంజాయి స్మగ్లింగ్ రాకెట్ ను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు శ్రీరామ్ తల్లిని అభినందించారు.