ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్య పరుస్తం

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్య పరుస్తం
  • మాలల బస్సు యాత్రను ప్రారంభించిన చెన్నయ్య

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మాలల బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోరింది. రాష్ట్రంలోని మాలలను చైతన్య పరిచేందుకు సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్  విగ్రహం నుంచి చేపట్టిన బస్సు యాత్రను  పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య, కన్వీనర్ సర్వయ్య, బేర బాలకిషన్, చెరుకు రామచందర్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును గ్రామ గ్రామాన వ్యతిరేకిస్తూ మాలలను చైతన్యం చేస్తామని తెలిపారు. బస్సు యాత్ర ద్వారా మాలలు ఐక్య పోరాటానికి సిద్ధమవుతారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు మాలల బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపోజు రమేశ్ బాబు, నల్లాల కనకరాజు, మంత్రి నరసింహాయ్య, మేక వెంకన్న, మంచాల లింగ స్వామి, గడ్డం సత్యనారాయణ, ఆవుల సుదీర్, గద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు.