సూర్యాపేట, వెలుగు : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి చెన్నకేశవస్వామి ఆలయంలో 120వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవిభూదేవి సమేత చెన్నకేశవస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా ఎదుర్కోలు నిర్వహించి బొడ్రాయి చౌరస్తాలో కల్యాణ మండపానికి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు. స్వామివారి కల్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజబాబు రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త ఉమ్మెంతల ఆహ్లాదరావు, ఉమ్మెంతల హరిప్రసాదరావు, అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు, దరూరి రాఘవాచార్యులు, గోమఠం రాఘవాచార్యులు, డైరెక్టర్లు చెరుకుపల్లి కృష్ణయ్య, మంగపండ్ల మల్లికార్జున్, కుమ్మరికుంట్ల జానయ్య, చెరుకుపల్లి సైదమ్మ, గంపల శంకర్ తదితరులు పాల్గొన్నారు.