చెన్నమనేని బుక్‌‌‌‌ను కొత్త ఎమ్మెల్యేలు చదవాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌

చెన్నమనేని బుక్‌‌‌‌ను కొత్త ఎమ్మెల్యేలు చదవాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌
  • అన్ని పార్టీల నేతలు గౌరవించే వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు: స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌
  • మూడు దశాబ్దాల ప్రజా వాణి చెన్నమనేని’ బుక్‌‌‌‌ను స్పీకర్, ఎమ్మెల్యే వివేక్‌‌‌‌కు అందజేసిన చెన్నమనేని రమేశ్‌‌‌‌ బాబు

హైదరాబాద్, వెలుగు: ‘శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజావాణి చెన్నమనేని’అనే పుస్తకాన్ని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తప్పకుండా చదవాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సూచించారు. చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌‌‌ బాబు, ఆయన కుటుంబసభ్యులు సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌‌‌‌‌‌‌‌తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ వినోద్‌‌‌‌కు 150 పుస్తకాలు అందజేశారు. ఈ పుస్తకాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ను రమేశ్‌‌‌‌ బాబు కోరారు.

 చెన్నమనేని రాజేశ్వర రావు, లలితా దేవి ఫౌండేషన్”ద్వారా ఈ బుక్‌‌‌‌ విడుదలైంది. ఈ సందర్భంగా స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ మాట్లాడుతూ.. చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ప్రజలు కోరుకునే పరిష్కార మార్గాలు చూపిన తీరు అభినందనీయమన్నారు. అందుకే పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా.. అన్ని పార్టీల నేతలు గౌరవించే అరుదైన నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారన్నారన్నారు. ఈ పుస్తకం ఆయన రాజకీయ జీవిత ఆశయాలను, పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసిన సేవను ప్రతిబింబిస్తుందన్నారు.

 శాసనసభను ప్రజలవాణిగా తీర్చిదిద్దాలనుకున్న ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పుస్తకం మంచి పాఠాలను అందిస్తుందని స్పీకర్‌‌‌‌‌‌‌‌కు చెన్నమనేని రమేశ్‌‌‌‌ బాబు తెలిపారు. 1957లో చొప్పదండి నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా చెన్నమనేని రాజేశ్వరరావు గెలుపొందారు. ఆ తర్వాత సిరిసిల్ల నుంచి 1967, 1978, 1985, 1994, 2004లో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు అసెంబ్లీలో 1967, 1978, 1985లో సీపీఐ ఫ్లోర్ లీడర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు.