బీఆర్ఎస్, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు : చెన్నమనేని వికాస్ రావు

వేములవాడ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబాల కోసం పని చేస్తాయని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని వేములవాడ ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్​ చెన్నమనేని వికాస్‌‌‌‌రావు అన్నారు. సోమవారం కథలాపుర్ మండలం  కలికోట, తుర్తి, అంబారిపేట, పోతారం, ఇప్పపల్లి, పోషానిపేట  గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ  సందర్భంగా వికాస్‌‌‌‌రావు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికే నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు.

తన తండ్రి విద్యాసాగర్ రావు స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బీఆర్ఎస్  ప్రభుత్వానికి 10 ఏళ్లు అవకాశం ఇస్తే ప్రజలకు చేసిందేమీ  లేదన్నారు. కేసీఆర్​పాలనలో బెల్ట్ షాపులు పెరిగాయని, విద్యావ్యవస్థ గాడితప్పిందని ఆరోపించారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.