మద్దూరు, వెలుగు: మండలంలోని చెన్నారెడ్డిపల్లి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అనిత, భర్త హన్మిరెడ్డి, నాగంపల్లి, నాగిరెడ్డిపల్లి, ఖాజీపూర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, కొత్తపల్లి మండలం దుప్పటిగట్టుకు చెందిన సీనియర్ లీడర్ తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కొడంగల్ లోని ఆయన ఇంట్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో సీనియర్ లీడర్లకు సరైన గుర్తింపు, ఆదరణ లేదని, సర్పంచులకు బిల్లుల మంజూరు చేయకపోవడంతో విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. సంజీవ్, హన్మంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
వంగూర్: అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు. అచ్చంపేట, కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, సర్పంచ్ భారతమ్మ, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, ఉప సర్పంచ్ వేమారెడ్డి పాల్గొన్నారు.