- లేదంటే పరువు నష్టం దావా వేస్త
- చట్టప్రకారమే నా ఫామ్ హౌస్ నిర్మాణం
- తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
కోల్‌బెల్ట్, వెలుగు: చట్ట ప్రకారమే తన ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ‘‘నేనెప్పుడూ చట్టానికి లోబడే వ్యవహరిస్తాను. జీవో 111ను ఉల్లంఘించినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూల్స్ప్రకారమే నా ఫామ్‌హౌస్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌కు నేను చాలెంజ్ చేస్తున్నా.. నీకు దమ్ముంటే నేను చట్టాన్ని ఉల్లంఘించినట్టు నిరూపించు. లేదంటే నీపై పరువు నష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు.
బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియాతో వివేక్ మాట్లాడారు. హైడ్రా నిబంధనల పరిధిలో తన ఫామ్‌హౌస్ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘కేవలం కేటీఆర్ప్రోత్సాహంతోనే ఆయన చెంచాగాళ్లు నా ఫామ్‌హౌస్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఎఫ్ ఆర్ఎల్కు 30 మీటర్ల తర్వాత నిర్మాణాలు చేసుకోవచ్చని చట్టంలో ఉంది. హైడ్రా చీఫ్రంగనాథ్ కూడా ఇదే విషయం చెప్పారు. నా ఫామ్హౌస్నిర్మాణంలో ఎక్కడా రూల్స్ ఉల్లంఘించలేదు” అని తెలిపారు.
కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నడు..
బీజేపీ-, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయి తనపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈడీ దాడులు చేయించారని.. కానీ ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిరూపించలేదని వివేక్అన్నారు. ‘‘ఇదంతా కేటీఆర్ చేసిన కుట్రలో భాగమే. నేను తప్పు చేస్తే కేసీఆర్అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేటీఆర్ అధికారం పోయిన తర్వాత ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడు.
ఫ్రస్ట్రేషన్లో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నాడు. కేటీఆర్‌కు చాలెంజ్చేస్తున్నా.. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పటాన్ చెరులో మా ఫ్యాక్టరీని మూసివేయించారు. కానీ నేను మీకు ఎక్కడా లొంగలేదు. మిమ్మల్ని గద్దె దించే వరకు పోరాడాను. తెలంగాణ ఉద్యమంలో మీకు, మీ కుటుంబానికి నేను ఎంత సహాయం చేశానో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు’’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ ఎవరినీ ఎదగనియ్యలేదు..
తెలంగాణలో ఏ నాయకుడూ ఎదగకుండా కేసీఆర్కుట్రలు చేస్తూ అడ్డుకున్నారని వివేక్ అన్నారు. ‘‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ అధికారంలోకి రాగానే మాట తప్పారు. కేసీఆర్తానే అధికారంలో ఉండాలనే కుట్రతో ఉద్యమకారులను పక్కనబెట్టారు. తన కుటుంబాన్నే బాగు చేసుకున్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్కోదండరాంకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. నాకు 2019లో పెద్దపల్లి ఎంపీ సీటు ఇస్తానని నమ్మించి, చివరి నిమిషంలో టికెట్ఇవ్వకుండా గొంతు కోసి రోడ్డున పడేసిండు. కేసీఆర్ అవినీతి, నిరంకుశపాలనకు వ్యతిరేకంగా నేను ఎన్నో పోరా టాలు చేశాను” అని చెప్పారు.