మిషన్ భగీరథ ఓ ఫెయిల్ స్కీం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ  ఓ ఫెయిల్ స్కీం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • జాతీయ రహదారులకు100 కోట్లు అడిగాం
  • ఎంపీ వంశీతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీని కోరా
  • చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్​: మిషన్ భగీరథ  ఓ ఫెయిల్ పథకమని చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ  మంచిర్యాల జిల్లా జైపూర్, భీమారం మండలాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  చెన్నూరులో బోర్లు వేయించి నీటి కొరతను తీర్చామన్నారు.  చెన్నూరులో వివిధ రకాల నిధులతో అభివృద్ధి పనులు చేయిస్తానని చెప్పారు.  నియోజకవర్గంలో పలు చోట్ల టాయిలెట్స్  ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.  నియోజకవర్గంలో మరో కొత్త గురుకులం  ఏర్పాటుకు సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడుతానని ఆయన వెల్లడించారు.

 నిజామాబాద్– జగదల్ పూర్ నేషనల్ హైవే 63 లోని జోడువాగు ల వద్ద రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు విడుదల అయ్యాయని తెలిపారు.  ఫారెస్ట్ శాఖ పర్మిషన్ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతుకు రూ. 83 లక్షలను మంజూరు చేశారు.  ఇటీవల పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ను కలిశామన్నారు. జాతీయ రహదారిని మరింత అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల నిధులను కేటాయించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.  అలాగే మరో కేంద్రమంత్రి ఉపేందర్ యాదవ్​ను  ను కలిసి ఫారెస్ట్ ప్రాంతాల్లో ఆగిపోయిన రోడ్లకు పర్మిషన్ ఇవ్వాలని కోరామన్నారు. ఇదే విషయంపై నిన్న రాష్ట్ర  ఫారెస్ట్ అధికారులను కూడా కలిశామన్నారు.  రైతులకు పట్టాలిచ్చినా సాగు చేసుకోకుండా ఫారెస్ట్ అధికారులు  ఇబ్బందులు పెడుతున్నారని చెప్పామని తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ తప్పుడు పట్టాలు ఇచ్చిందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంట్​స్తంభాలను సరఫరా చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.  

పిల్లలు  ఉన్నత శిఖరాలకు చేరుకోవాలె

పిల్లలు మంచిగా బాగా చదువుకొని  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. స్కూల్ పిల్లలతో కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం అనందగా ఉందన్నారు. కాక చదువు పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపే వారన్నారు.  ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. చెన్నూరు లో ఉన్న ఫారెస్ట్,రోడ్ల సమస్యల పై కేంద్ర మంత్రులతో మాట్లాడి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. పెద్దపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ వ్యవస్థే కీలకమైందన్నారు.