గిరిజన భవనానికి 7 గుంటల భూమి, రూ. 25 లక్షల నిధులు.. సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్

గిరిజన భవనానికి 7 గుంటల భూమి, రూ. 25 లక్షల నిధులు.. సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్

గిరిజన భవనానికి 7 గుంటల భూమి, రూ. 25 లక్షల నిధులు కేటాయిస్తానని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ లో సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి లంబాడీలకు న్యాయం జరిగేలా చేస్తానని,   సోషల్ వెల్ఫేర్ కు నిధులు పెంచేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎంతో ఇదివరకే మాట్లాడానని, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 

సేవాలాల్ మహరాజ్ సంబాడీ జాతికి ఎనలేని సేవలు చేశారని, ఆయనంటే తనకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే నిధులు వారికే  కేటాయించాలని కలెక్టర్ తో చెప్పినట్లు తెలిపారు.

ALSO READ | గాంధారీ ఖిల్లాను దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నియోజగకవర్గంలో సమస్యలు ఉన్న ప్రాంతాలకు నిధులు  మంజూరు చేసి పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా సోమనపల్లి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొనసాగుతోందని.. వచ్చే సంవత్సరం నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ ను అభివృధి చేసి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు.