పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమి లేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు వివేక్. మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే..కాంగ్రెస్ కు ఓటెయ్యాన్నారు. తన తనయుడు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే వివేక్..
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఓడించినట్టే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓడించాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వంశీ ఈకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక కూలీలను అల్పహారం అందించారు నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన నెరవేరుస్తదన్నారు.