మంచిర్యాలలో ఓటేసిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో  ఓటేసిన వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల టౌన్లోని కార్మెన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. 

అంతకు ముందు పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఓటింగ్ ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.