- కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
కోల్ బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : ఎంపీగా, ఎమ్మెల్యేగా పదేండ్లు కొనసాగిన బాల్క సుమన్ ఏనాడూ చెన్నూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించలేదని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బుధవారం చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి, రాయిపేట, నారాయణ పూర్, దుగినేపల్లి, సుందరశాల, నర్సక్కపేట, ముత్తరావు పల్లి, సోమానపల్లి తదితర గ్రామాల్లో వివేక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీలు కాంగ్రెస్ లో చేరగా.. వారికి వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి ఆహ్వానించారు. చెన్నూరు పట్టణంలోని జెండవాడకు చెందిన సీనియర్ బీఆర్ ఎస్ నేత పెద్దింటి శ్రీనివాస్ ను తన ఇంట్లో కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని నారాయణపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ నిట్టూరి సుధాకర్ తో పాటు 50 మంది కాంగ్రెస్ లో చేరారు.
సుందరశాలలో 400 మంది
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుండా భాస్కర్ రెడ్డి, గుండా మోహన్ రెడ్డి, గుండా సత్యనారాయణ రెడ్డి, గుండా బాల్ రెడ్డితో పాటు 400 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హస్తం గూటికి చేరగా వారికి వివేక్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సోమనపెల్లి బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ సునీత బాపగౌడ్, మాజీ సర్పంచ్ తోకల కొమురమ్మ, వార్డ్ మెంబర్లు తాళ్లపల్లి సుజాతతోపాటు మరో ముగ్గురు వార్డు మెంబర్లు, 300 వందల మంది గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు వివేక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేశారు.
పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో నేతలు మూల రాజిరెడ్డి, చల్లా రాంరెడ్డి, గొడిశెల బాపిరెడ్డి, మైదం రవి కళావతి, సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ, వంగల కృష్ణారెడ్డి, నీలం శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సుశీల్, చింతల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు రాజన్న, లచ్చన్న పాల్గొన్నారు.
వివేక్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తం
చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామిని గెలిపించాలంటూ భీమారం మండల కేంద్రంలోని కాలనీల్లో ఆయన అభిమానులు, పార్టీ లీడర్లు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించారు. తమ నేత వివేక్ వెంకటస్వామి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు వెల్లడించారు. పార్టీ లీడర్లు భాస్కర్ రెడ్డి, చల్లా రాజిరెడ్డి, శశిధర్ రెడ్డి, కేపీ రవి, రమేశ్, సంపత్, తిరుపతి, తైనేని రవి, కిరణ్య బాబు తదితరులు పాల్గొన్నారు.
బాల్క సుమన్ ఓ వృద్ధుడ్ని బెదిరించి జాగా గుంజున్నడు
బాల్క సుమన్ ప్రజలకు సేవ చేయడానికి, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కాలేదని.. ప్రజలను దోచుకునే అందుకే అయ్యాడని జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఫైర్అయ్యారు. క్యాతనపల్లికి చెందిన ఓ వృద్ధుడిని బెదిరించి అతడి జాగా గుంజుకొని నేషనల్ హైవే వద్ద ఇల్లు కట్టాడని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మాజీ కలెక్టర్ భారతి హోలికేరీని బెదిరించి కోట్ల రూపాయలు సంపాదించాడని.. ఆ తర్వాత చెప్పిన పని చేయకపోతే ట్రాన్స్ఫర్ చేయించారని అన్నారు.
దళిత బంధును పేద కుటుంబాలకు కాకుండా తమ అనుచరులకే ఇప్పించాడని అన్నారు. అక్రమార్కుడు బాల్క సుమన్‌ను ఇక్కడి నుంచి తరిమికొట్టాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో లీడర్లు పొడేటి రవి, వేల్పుల శ్రీనివాస్, కటుకూరి ప్రకాశ్ రెడ్డి, యాదవ సంఘం మెంబర్లు వేల్పుల పర్వతాలు, కొమ్ము శ్రీనివాస్, బోయిని బుజ్జయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.3