అన్ని రంగాల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వివేక్

అన్ని రంగాల్లో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. గురువారం (జనవరి 30) భీమారం మండల కేంద్రంలో స్టేడియం కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

భీమారం మండల ప్రజల కోరిక మేరకు స్టేడియం కోసం కలెక్టర్‎తో మాట్లాడి ఐదు ఎకరాల భూమిని కేటాయించానని తెలిపారు. ఇక్కడ స్టేడియం అందుబాటులోకి వస్తే గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్‎గా మార్చాలని ఇచ్చిన పిలుపు మేరకు యువత మంచి మార్గంలో నడిచేందుకు క్రీడలను ప్రోత్సహిస్తానని తెలిపారు. 

సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఇందారంలో ఒక స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తానన్నారు. భీమారంలో పీహెచ్సీ నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. భీమవరంలో 108 సర్వీస్,  చెన్నూరులో  రెండు 102 అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు.  

నియోజకవర్గంలో మరింత మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సిబ్బందిని పెంచాలనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లా చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ  పనులు సాగుతున్నాయని.. అమృత్ స్క్రీమ్ ద్వారా మరో రూ.100 కోట్లతో మందమర్రి, ఖ్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం పనులు చేపట్టామని తెలిపారు.