
చెన్నూరు, వెలుగు: చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు ఆయకట్టు కింద 200 ఎకరాల యాసంగి వరి పొలాలలోకి వెళ్లే కాలువ మట్టితో పూడుకుపోయింది. దీంతో నీరందక పంటలు పండే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు ఆదివారం క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి సమస్య విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
రైతులకు సజావుగా నీళ్లందేలా చూడాలని, కాలువ పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలని చెన్నూరు డివిజన్ ఇరిగేషన్ అధికారి ఈఈ విష్ణుకు ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన ఈఈ విష్ణు సోమవారం ఉదయం జేసీబీతో కాలువలోని పూడికను తీసివేయించి చెరువు కింది ఆయకట్టు పొలాలకు నీరందేలా చర్యలు తీసుకున్నారు. వెంటనే స్పందించిన తమ సమస్య తీర్చిన ఎమ్మెల్యే వివేక్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.