పెద్దపల్లి జిల్లాలో చెన్నూర్​ ఎమ్మెల్యే పర్యటన

పెద్దపల్లి జిల్లాలో చెన్నూర్​ ఎమ్మెల్యే పర్యటన

పెద్దపల్లి, వెలుగు:  చెన్నూర్​ఎమ్మెల్యే డాక్టర్​గడ్డం వివేక్​వెంకటస్వామి శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు శుభకార్యాలకు హాజరయ్యారు. మంథనిలో కాళేశ్వరం ఆలయ మాజీ చైర్మన్​అవధానుల మోహన్​శర్మ మనువడి ఉపనయనం కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రంగాపూర్ ఫంక్షన్​హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొండపాక శ్రీనివాసాచార్యులు కుమార్తె విష్ణుప్రియ వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.

 పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో యూత్​ కాంగ్రెస్​లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుమలరావు తమ్ముడి వివాహానికి హాజరై నవ జంటను ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో లీడర్లు సయ్యద్​ సజ్జాద్, బండారి సునీల్, కొండి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర నాయకులు, కార్యకర్తలు , వివేక్​ అభిమానులు పాల్గొన్నారు.