
పెద్దపల్లి, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నూర్ వెళ్తున్న ఆయనకు ఆదివారం జిల్లా కేంద్రంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ప్రజలంతా ఈ ఏడాది సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. వివేక్ కలిసిన వారిలో దిశ కమిటీ మెంబర్, మాజీ సర్పంచ్ నయ్యద్ సజ్జర్, బండార్ సునీల్, బాలసాని సతీశ్ అడగుంట శ్రీనివాస్,కొంది.సతీ శ్రీ గంగుల సంతోష్, తిరుపతి ఉన్నాడు.