కొత్త బొగ్గు గనులు తెచ్చేందుకు కృషి : గడ్డం వంశీకృష్ణ

  •     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ తనయుడు గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణిలో కొత్త  బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​వివేక్​ వెంకటస్వామి కృషి చేస్తున్నారని ఆయన తనయుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, మందమర్రిలో నిర్వహించిన కాంగ్రెస్​ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ సర్కార్​ ఆరు గ్యారంటీలను ప్రకటించి ఇప్పటికే రెండింటిని అమలు చేసిందని, మిగతావి కూడా ప్రజలకు అందిస్తుందని తెలిపారు.  ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్యాచరణ చేస్తున్నారని చెప్పారు. సింగరేణి ఓసీపీ

పవర్​ ప్లాంట్​లో 80శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సింగరేణి నుంచి జీవో కూడా ఇప్పించారన్నారు.  జైపూర్​ సింగరేణి పవర్​ ప్లాంట్​లో 800 మెగావాట్ల మూడో ప్లాంట్​ ఏర్పాటుకు సర్కార్​ను ఒప్పించారని, సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్త గనులు, మూడో పవర్​ ప్లాంట్​ విస్తరణతో ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్​ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.

చెన్నూరు ప్రాంత వనరులు వినియోగించుకునే ప్రభుత్వరంగ సంస్థలు ఇక్కడికి వస్తే ప్రజలకు లబ్ధి కలుగుతుందని,  వాటి కోసం ఎమ్మెల్యే  కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వంశీకృష్ణకు రామకృష్ణాపూర్, మందమర్రి కాంగ్రెస్​ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట పీసీసీ జనరల్​ సెక్రటరీ పి.రాఘునాథ్​రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్​, రామకృష్ణాపూర్

మందమర్రి టౌన్​ ప్రెసిడెంట్లు పల్లె రాజు, నోముల ఉపేందర్​గౌడ్, ఎండీ అబ్బుల్​ అజీజ్, మహంకాళీ శ్రీనివాస్, గుడ్ల రమేశ్, తేజావత్​ రాంబాబు,  పుల్లూరి లక్ష్మణ్​, గద్దె రాంచందర్, గడ్డం రజనీ, మొట్ట సుధాకర్​, నెర్వేట్ల శ్రీనివాస్,  పాషా, అర్జూన్, జావిద్ , సంతోశ్, చిర్రకుంట సర్పంచ్​ ఓడ్నాల కోమురయ్య ఉన్నారు. 

బాధిత కుటుంబాలను పరామర్శ 

రామకృష్ణాపూర్ కాకతీయకాలనీకి  చెందిన కాంగ్రెస్​ సీనియర్​ కార్యకర్త కందుల చంద్రయ్య ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని గడ్డం వంశీకృష్ణ గురువారం పరామర్శించారు. గద్దెరాగడిలో ఐఎన్టీయూసీ లీడర్​ ముద్దసాని కృష్ణ తల్లి రాధమ్మ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.