
సంగారెడ్డి టౌన్ , వెలుగు : అంబేద్కర్ యువజన సంఘం పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండరును ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జగన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు అశోక్, నాయకులు సాగర్, ప్రభుదాస్, నంద కిషోర్, గోపాల్, మల్లేశం, సురేశ్, యాదిగిరి, పురుషోత్తం, రవీందర్, ఆంజనేయులు, నగేశ్, మోహన్ రాజ్, వెంకటేశ్ ఉన్నారు.