మంథని టౌన్/ముత్తారం, వెలుగు : వంశీకృష్ణను ఆశీర్వదించి గెలిపించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ, దుద్దిళ్ల శ్రీనుబాబు ప్రజలను కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో గడ్డం సరోజ వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినిపేటలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రతి ఉపాధి కూలికి రోజు వారి కూలి రూ.400 ఇవ్వనుందన్నారు. అంతకుముందు ముత్తారం మండలం పోతారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబుకు వచ్చిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించాలన్నారు.
అనంతరం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీ, జగన్ మోహన్ రావు, యాదగిరి రావు, పద్మ, సురేందర్ రెడ్డి తో పాటు తదితరులు ఉన్నారు.