మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన

మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  కోటపల్లి మండలానికి సంబంధించి 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ పనులకు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.

 నక్కలపల్లి లోటు వాగు లో లెవల్ వంతెనను  చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తాను ఎన్నికల  సమయంలో  ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ లో లెవల్ వంతెనను ప్రారంభించానని చెప్పారు. 

ALSO READ | సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి 55 ఎకరాల ఫారెస్ట్ భూములను కొనుగోలు చేశామన్నారు.  త్వరలోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు లేక ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామని చెప్పారు.   నక్కల పల్లి రహదారికి కూడా త్వరలో నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్.