మందమర్రిలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

మందమర్రిలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం మందమర్రిలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సోమవారం (మార్చి 31) పాత బస్టాండ్ ఏరియాలో ‘One Medi Hub’ ఉచిత మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు. మెడికల్ టెస్ట్ లు చేసుకునేందుకు మందమర్రి పట్టణ ప్రజలు,వృద్ధులు భారీగా తరలివచ్చారు. 

చెన్నూరు నియోజకవర్గంలో వైద్యం మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు. one medi hub మొబైల్ వాహనంలో 20 రకాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని.. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబర్చాలని, ఆహారపు అలావాట్లను ఆరోగ్యానికి అనుగుణంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. 

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు 1 medi hub అందుబాటులో ఉంటుందని చెప్పిన ఎమ్మెల్యే.. అత్యాధునిక సాంకేతికత కలిగిన వైద్య పరీక్షలను 1 medi hub అందిస్తుందని తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఈ సేవలను మరింత విస్తృత పరిచేందుకు ఈ సంస్థ సహకరించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయి. బేబీ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఉప్పు, కారం, నూనె తగిన మోతాదులో వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.